![]() |
![]() |
.webp)
సూపర్ సింగర్ షో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఈ షోలో జడ్జెస్ కన్నా, కంటెస్టెంట్స్ కన్నా కూడా హోస్ట్ శ్రీముఖి ఫుల్ ఫేమస్ అయ్యింది. మరి అలాంటి శ్రీముఖి స్టార్ మాలో ఏ షో చేసిన అది దడదడే...మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. మరి అలాంటి శ్రీముఖి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. "నా సింగింగ్ షో కెరీర్ స్టార్ట్ అయ్యింది స్టార్ మాలో. సూపర్ సింగర్ సీజన్ 9 కి హోస్ట్ చేసాను. టాలీవుడ్ కి ఈ సూపర్ సింగర్ షో ఎంతోమంది ప్లే బ్యాక్ సింగర్స్ ని ఇచ్చింది. షోకి వచ్చి హోస్ట్ చేసి వెళ్ళిపోతే మజా ఏముంటుంది.
కొంత స్క్రిప్టెడ్ ఉంటుంది కానీ మొత్తం స్పాంటేనిటీతోనే ఎక్కువ నడిపిస్తాను. అనంత శ్రీరామ్ చూడడానికి లెజెండరీ లిరిసిస్ట్ కానీ ఆయనలో చిన్నపిల్లాడి తత్వం అనేది పోలేదు. మంగ్లీ, రాహుల్ ఇద్దరూ ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ క్యూట్ గా ఉంటారు. ఆడియన్స్ ని లాక్ చేసి షోని చూపించాలంటే ఏదో ఒక పుల్ల పెట్టాలి...వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాకుండా ఏదో ఒక కొత్తదనం కోసం ట్రై చేస్తూ ఉండాలి. ఈరోజున మంచి ఛాన్సెస్ రావాలంటే సోషల్ మీడియా గిమ్మిక్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. లవ్ ట్రాక్ అంటూ ఏమీ లేదు.. కానీ వెంకటేష్ లో కొన్ని రోజులు ట్రాక్ ఉంది, కొన్ని ఎపిసోడ్స్ లో రాహుల్ తో ఇక అనంత్ గారు ఫరెవర్ లవ్ ట్రాక్...శ్వేతామోహన్ గారికి నేనంటే ఇష్టం నాకు ఆమె అంటే ఇష్టం. ఇంకా కొత్త షోస్ వస్తున్నాయి. టీవీ ఒక్కటే జనాలందరికీ నన్ను కనెక్ట్ చేసి ఉంచుతుంది. అందుకే నేను సినిమాల వెళ్ళడానికి ఇంటరెస్ట్ చూపించడం లేదు. టీవీలో నాకు వర్క్ లేదన్నప్పుడు నేను మూవీస్ వైపు ఆలోచిస్తాను." అని చెప్పింది శ్రీముఖి.
![]() |
![]() |